అమ్మ ఒడి/టపా కాయ....మొ.వి
(పార్క్ వుడ్ పాపం దేనికి ప్రతిఫలం?)
చాలా మంది లా కాకుండా, మెదడుతో ఆలోచించి, సమస్యని సరిగ్గా గుర్తించి, విశ్లేషించి, ప్రశ్నించి, ఆక్రోశించి, హెచ్చరించే చక్కని టపాలు వ్రాస్తున్న ఓ వుపాధ్యాయురాలు--ఈ అమ్మాయి.
పేరు యడ్ల ఆదిలక్ష్మి.
ఎనోనిమ్ లూ, సూడోనిమ్ లు పెట్టుకొన్నవాళ్లూ వ్రాసే కొన్ని పిచ్చి పిచ్చి బ్లాగురాతలకన్నా, ధైర్యం గా సొంతపేరుతో వ్రాయడం నిజం గా అభినందించదగ్గది.
ఆవిడ లేవనెత్తే విషయాలూ, సందేహాలూ, ప్రశ్నలూ నిజం గా చదవవలసినవాళ్లు చదివితే, తలకాయలు యెక్కడ
పెట్టుకుంటారో?
అయినా మనకా భయం అక్కర్లేదులెండి--వాళ్లు చదవరు--ఒకవేళ చదివినా, వాళ్ల చర్మాలు చాలా మందం కదా!
సూచన : కృషిని కొనసాగించండి. బ్లాగు లోకానికి మీలాంటివాళ్ల అవసరం చాలా వుంది. యువత కొంతైనా వుత్తేజితమవుతుందేమో!
రికమెండేషన్ : అందరూ తప్పక చదవాలి, అలోచించాలి, చెయ్యదగ్గదేమైనా వుంటే తప్పక చెయ్యాలి.