తెలుగిల్లు
(....ఐన్యూస్ కు తెగులు సోకిందహో!)
"యేమీ రాకపోయినా, ఓ వుద్యోగం సంపాదించి మేమూ ఘనులమే అని మురిసిపోతుంటారు కొందరు.
'హఠాత్తుగా' అని రాయడానికి బదులు 'హటాత్తుగా'అనీ, 'స్థలాని'కి బదులు 'స్థళం'అనీ, 'సగం'కి బదులు 'సహం'అనీ, 'ఛందస్సు'కు బదులు 'చందస్సు'అనీ, 'భేదం'కి బదులు 'బేధం'అనీ, 'మధ్యాహ్నం'కి బదులు 'మద్యాన్నం, మజ్జాన్నం'అనీ, 'జాతీయ'కి బదులు 'జాతియ'అనీ, 'వెళ్తూ' అని రాయమంటే, 'వెడుతూ'అనీ రాసిపారేసి చేతులు దులుపుకునే సీనియర్ ఉపసంపాదకులున్న పాత్రికేయ ప్రపంచం ఇది. చిత్రమేమిటంటే సాహిత్యం గురించి తెలీకున్నా కనీసం ఇంగ్లిష్ పదం 'సిన్సియర్లీ'కి సైతం స్పెల్లింగ్ రాని ఇలాంటి ప్రబుధ్ధులనే పదోన్నతులు వరిస్తుంటాయి. అక్షర దోషాలు లేని పత్రికలే ప్రజాదరణకి నోచుకుంటాయి. పత్రికలలో యెవరి పొరపాటు జరిగినా పాఠకులకు అవి తీవ్ర అసౌకర్యాన్ని కలిగించి పదాల అర్థాలను మార్చేస్తాయి............"
==> 2002వ సంవత్సరం, జనవరి నెల "విపుల" మాసపత్రిక లోంచి ఈ చిన్న పేరా యదాతథం గా!
మన న్యూస్ రైటర్లూ,ఇంజనీర్లు ఇప్పుడు కూడా అలానే వున్నారు మరి!
వీళ్లకి ద్వా నా శాస్త్రి ప్రశ్నల్లాంటి "పండితరాయలు అంటే యెవరు? ఆయన యే యే కావ్యాలు వ్రాసాడు? వాటిని యెవరెవరికి అంకితమిచ్చాడు?" లాంటి ప్రశ్నలతో పరీక్షించకుండా........... "విష్వక్సేనుడు" లాంటి పదాలతో డిక్టేషన్ ఇచ్చి, కరెక్టుగా వ్రాసినవాళ్లకే వుద్యోగాలంటే.....చచ్చినట్టు దారికొస్తారు!
సూచన : కొనసాగించండి!
రికమెండేషన్ : తెలుగు వాళ్లు, తెలుగు గురించి తపనపడేవాళ్లు చదవ వలసిన ఆంతర్యం!
1 comment:
తప్పులు లేని తెలుగు కోసం మీ తపన అందరూ అర్ధం చేసుకోవాలని నా విగ్నప్తి. మీ షూచనలను ఎప్పటికప్పుడు స్పందనలలో పెడుతూ, కొన్నింటిని నేర్చుకుంటున్నాను కూడా.
Post a Comment